ప్రభుత్వ శాఖలన్నిటిలోనూ డ్రోన్‌ సేవలు : డ్రోన్‌ కార్పొరేషన్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోనూ డ్రోన్‌ సేవలు వినియోగించనున్నట్లు డ్రోన్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. గనులు, పురపాలక, రెవెన్యూ, అటవీ, ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్‌, పర్యావరణం, నీటిపారుదల, వ్యవసాయ, హోంశాఖ, దేవాదాయశాఖతోపాటు అనేక శాఖల్లో సేవలు వినియోగించుకునేందుకు కసరత్తు మొదలుపెట్టినట్లు కార్పొరేషన్‌ వర్గాలు వెల్లడించాయి. ఓర్వకల్లులో డ్రోన్‌ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపే సంస్థలు, యూస్‌కేసెస్‌ అభివృద్ధికి సంబంధించిన ఔత్సాహికులు, ఔత్సాహిక సంస్థలు ఎంపానల్‌మెంట్‌ కోసం తమ ప్రతిపాదనలను ఈ నెల 21లోగా ఎపి డ్రోన్‌ కార్పొరేషన్‌కు ఆన్‌లైన్‌ ద్వారా అందజేయాలని ఆ సంస్థ కోరింది. వివరాలు, ప్రతిపాదనల సమర్పించేందుకు www.apsfl.in/notifications.php వెబ్‌సైట్‌ను లేదా వాట్సాప్‌ నెంబరు 7995511440 ద్వారా సంప్రదించాలని డ్రోన్‌ కార్పొరేషన్‌ కార్యాలయం పేర్కొంది.

➡️