సెల్‌ టవర్‌ ఎక్కి డీఎస్సీ అభ్యర్థి నిరసన

Mar 4,2024 14:22 #DSC 2024, #gunter, #suside

ప్రజాశక్తి-గుంటూరు : 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ టీచర్స్‌లో మిగిలిపోయిన రెండు వేల మందికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఓ వ్యక్తి పురుగుల మందు డబ్బా పట్టుకొని సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లాకు చెందిన అభ్యర్థి భైరవకోన శ్రీనివాసరావు గుంటూరు జిల్లా మంగళగిరిలో పురుగుల డబ్బా చేత పట్టుకొని జాతీయ రహదారి పక్కనే ఉన్న సెల్‌ టవర్‌ ఎక్కారు. వైసీపీ జెండా వేసుకొని సీఎం ఫ్లెక్సీతో సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ దీనిపై నిర్ణయం తీసుకోకపోతే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియోలో హెచ్చరించారు. బొత్స సత్యనారాయణ తనను కలిస్తేనే కిందకు దిగుతానంటూ డిమాండ్‌ చేశారు. లేదంటే పురుగుల మందు తాగుతానని హెచ్చరించారు. దీంతో బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

➡️