కరీంనగర్ : ఒక జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగం కోసం డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారికి మరో జిల్లాలో పోస్టుకు అప్లై చేసుకున్నట్లుగా హాల్‌టికెట్‌లో రావడంతో అభ్యర్థులు కంగుతింటున్నారు. ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగుకు చెందిన శ్రీపెల్లి జ్యోత్స్న మంచిర్యాల జిల్లాలో ఎస్జీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 19న డీఎస్సీ పరీక్ష ఉండగా ఆమె నల్గండ జిల్లాలో పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు హాల్ టికెట్ జారీ చేశారు. పరీక్ష కేంద్రాన్ని ఆదిలాబాద్ జిల్లా మావలలో కేటాయించారు. మరో ఘటనలో కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొర్కల్‌కు చెందిన పొరెడ్డి సౌజన్య డీఎస్సీలో అదే జిల్లాలో ఎస్‌ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 24న కరీంనగర్‌లో పరీక్ష ఉండగా హాల్‌టికెట్‌లో మాత్రం ఖమ్మం జిల్లాలో పోస్టుకు అప్లై చేసుకున్నట్లుగా ఉంది. ఈ విషయంపై హెల్ప్‌డెస్క్‌కు ఫిర్యాదు చేశామని, చాలామందికి ఇలాగే తప్పుగా వచ్చాయని సౌజన్య తెలిపారు. దీనిపై విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి పొరపాటును సరిచేయాలని కోరారు.
దరఖాస్తులో ఓ జిల్లా.. హాల్‌టికెట్‌లో మరో జిల్లా: ఆందోళనలో డీఎస్సీ అభ్యర్థులు
