మాజీ హోంమంత్రికి చేదు అనుభవం

Feb 10,2024 15:05 #DSC Notification, #Protest, #YCP Govt

మెగా డీఎస్సీ ప్రకటించాలంటూ మంగళగిరిలో నిరసన 
సుచరిత వాహనాన్ని అడ్డుకున్న తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు
ప్రజాశక్తి-మంగళగిరి : మెగా డీఎస్సీ ప్రకటించాలంటూ శనివారం తెలుగు యువత, టిఎన్ఎస్ ఎఫ్, నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళగిరిలో నిరసన ర్యాలీ జరిగింది. మంగళగిరి కూరగాయల మార్కెట్ సెంటర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం నుండి మిద్దె సెంటర్ మీదుగా గౌతమ్ బుద్ధ రోడ్డు, పాత బస్టాండ్ సెంటర్ మీదగా అంబేద్కర్ సెంటర్ వరకు మోటార్ బైకులతో ర్యాలీ నిర్వహించారు. ఇదే సమయంలో అటువైపు వెళుతున్న మాజీ హోంమంత్రి సుచరిత వాహనాన్ని టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత, నిరుద్యోగ జేఏసీ కార్యకర్తలు చుట్టుముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినప్పటికీ సుచరిత వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయారు. ఈ సందర్భంగా సుచరిత వాహనాన్ని పంపించే క్రమంలో పోలీస్ పోలీసులకు ఒకరికి స్వల్ప గాయం అయింది. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు ఆర్ సాయి కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, జె కిరణ్ చంద్, పి మహేష్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆర్ కిరణ్, పి జీవన్, జి కిరణ్, ఎస్ గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️