వెబ్‌సైట్‌లో డిఎస్సీ సిలబస్‌

Nov 28,2024 00:23 #ap government, #DSC Syllabus, #website

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న నేపథ్యంలో డిఎస్సి సిలబస్‌ను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. డిఎస్సి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు సిల బస్‌ను apdsc2024.apcfss.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

కాగా డిఎస్సి పరీక్ష రాసే మైనారిటీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌ తెలిపారు. మైనారిటీ విద్యార్ధులైన ముస్లింలు, క్రైస్తవులు (బిసి-సి), సిక్కులు, బౌద్దులు, జైనులు, పార్సీ తదితరులకు ఉచిత శిక్షణ తరగతుల నిర్వహణకు అర్హులైన సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానించినట్లు చెప్పారు.

➡️