ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్‌సి సిలబస్ బుధవారం విడుదల కానుంది. త్వరలో విడుదల కానున్న మెగా డిఎస్‌సి నోటిఫికేషన్ నేపథ్యంలో సిలబస్‌ను బుధవారం విడుదల చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుకల్పిస్తూ సిలబస్ విడుదల చేస్తున్నామని వెల్లడించారు. apdsc2024.apcfss.in వెబ్‌సైట్‌లో బుధవారం ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంచుతామని, అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని పేర్కొన్నారు.