దుర్గగుడి ఘాట్‌ రోడ్డు మూసివేత

Jul 14,2024 13:33 #closure, #Durgagudi Ghat road

విజయవాడ : ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇంద్రకీలాద్రి కొండ చరియలు విగిరి పడుతున్నాయి. దీంతో అధికారులు దుర్గగుడి ఘాట్‌ రోడ్డుని మూసివేశారు. మహా మండపం నుంచి మాత్రమే యాత్రికులను అనుమతిస్తున్నారు. కొండరాళ్ళు దొర్లిపడకుండా ముందస్తుగా ఘాట్‌ రోడ్డును అధికారులు మూసివేశారు. దుర్గాఘాట్‌ నుంచి దేవస్ధానం బస్సులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఒకవైపు ఆదివారం సెలవు రోజు కావడంతో దుర్గమ్మ కు ఆషాఢం సారె సమర్పించేందుకు పెద్ద ఎత్తున యాత్రికులు ఆలయానికి తరలివచ్చారు. వాహనాలను నిలిపేందుకు రధం సెంటర్‌, పద్మావతి ఘాట్ల వద్ద పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. యాత్రికుల రద్దీ దృష్ట్యా వీఐపీ దర్శనాలు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

➡️