శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ

Oct 4,2024 20:34 #Dasara Festival

– రెండో రోజు భారీగా తరలి వచ్చిన యాత్రికులు
ప్రజాశక్తి – వన్‌టౌన్‌ (విజయవాడ) : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నారు. రెండో రోజు శుక్రవారం శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ కొలువుతీరారు. అమ్మవారిని దర్శించుకునేందుకు యాత్రికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యాత్రికులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా ప్రభుత్వం, ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సృజన, సిపి ఎస్‌వి రాజశేఖర్‌బాబు పర్యవేక్షణలో సిబ్బంది యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా సేవలందిస్తున్నారు. ఘాట్‌ రోడ్డులోని క్యూలైన్లను సమగ్రంగా కలెక్టర్‌ సృజన పరిశీలించారు. క్యూలైన్లోని వారందరికీ అవసరమైన సహాయం అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గాయత్రీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్‌, అమలాపురం ఎంపి గంటి హరీష్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్య యాత్రికులకు త్వరితగతిన దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రముఖులకు ప్రత్యేక యాప్‌ ద్వారా దర్శించుకునే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

➡️