శాంతిభద్రతలు పునరుద్ధరణపై ఈసీ, పోలీసులు దృష్టిపెట్టాలి: చంద్రబాబు

May 14,2024 16:01 #Chandrababu Naidu, #speech

అమరావతి: నిన్నటి పోలింగ్‌లో వైసిపి గూండాల దాడులను ధైర్యంగా ఎదురించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలపై పోలింగ్‌ అనంతరం కూడా దాడులకు తెగబడుతున్నారని టిడిపి అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పల్నాడు, చంద్రగిరి సహా పలుచోట్ల ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం ఆందోళనకరమన్నారు. ఎన్నికల సంఘం, పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలని కోరారు. హింసను ప్రేరేపిస్తున్న శక్తులపై కఠినంగా వ్యవహరించి ప్రజలకు రక్షణ కల్పించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

➡️