జెసి ప్రభాకర్‌రెడ్డిపై ఇడి ఛార్జిషీట్‌

May 14,2024 23:42 #ED case, #jc prabhakar reddy

ప్రజాశక్తి – అనంతపురం ప్రతినిధి : మనీలాండరింగ్‌ కేసులో అనంతపురం జిల్లా టిడిపి సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డిపై మంగళవారం ఇడి ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో మొత్తం 17 మందిపై ప్రాసిక్యూషన్‌ ఫిర్యాదును నమోదు చేసింది. జెసి ప్రభాకర్‌రెడ్డి కంపెనీలకు చెందిన వాహనాలకు మన రాష్ట్రంలోనూ నాగాలాండ్‌, కర్ణాటక రాష్ట్రాల్లోనూ తప్పుడు ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి 2022లో జెసి ఆస్తులను ఇడి అటాచ్‌ చేసింది. అందులో భాగంగా ప్రస్తుతం ప్రభాకర్‌రెడ్డిపై ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

➡️