గొర్రెల స్కామ్‌ లో దర్యాప్తు.. రంగంలోకి ఈడీ..

Jun 13,2024 11:55 #ED, #investigation, #sheep scam

తెలంగాణ: గొర్రెల స్కామ్‌ లో దర్యాప్తునకు ఈడీ రంగంలోకి దిగింది. గొర్రెల స్కామ్‌ లో జరిగిన 700 కోట్ల అవినీతి పై ఈడీ దఅష్టి పెట్టింది. గొర్రెల పంపిణీ పధకంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్టు ఆధారాలు గుర్తించారు. పి.ఏం.ఎల్‌.ఏ.యాక్ట్‌..కింద గొర్రెల స్కామ్‌ పై విచారణ చేయనున్నారు. గొర్రెల స్కీమ్‌ కు సంబంధించిన పూర్తి వివరాలు అందివ్వాలని పశు సంవర్ధక శాఖ అధికారులకు ఈడీ లేఖ రాసింది. రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పంపిణీ పధకం లబ్దిదారుల వివారాలు ఇవ్వాలని ఈడీ కోరింది. గొర్రెల కొనుగోలు కోసం ఏయే జిల్లాల్లో ఏ అధికారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అయిందని ప్రశ్నించింది.
ఎంత జమ చేశారు వంటి.. విషయాలపై ఈడీ ఆరా తీస్తుంది. గొర్రెల రవాణాలో కాంట్రాక్టు కుదుర్చుకున్న ఏజెన్సీల వివరాలు కోరింది. గొర్రెల స్కామ్‌ మూడు రోజుల కస్టడీ విచారణలో మాజీ అధికారులు నోరు మెదపడంలేదు. కుంభ కోణానికి కారకులు ఎవరు? ఎవరెవరి పాత్ర ఉంది? రికార్డ్స్‌ లో తప్పుడు లెక్కలపై ఏసీబీ ప్రశ్నించింది. గొర్రెలు అమ్మిన రైతుల ఖాతాలకు కాకుండా.. ఇతర బినామీల ఖాతాలకు డబ్బు మళ్ళింపుపై ప్రశ్నించారు. ఏసీబీ విచారణకు మాజీ ఎండీ రామ్‌ చందర్‌ నాయక్‌, ఓ ఎస్డి కళ్యాణ్‌ కుమార్‌ సహకరించడం లేదని పేర్కొన్నారు. మూడు రోజుల కస్టడీ విచారణ పూర్తి కావడంతో తిరిగి చంచల్‌ గూడ జైలుకు నిందితులను తరలించారు. కాగా.. రూ.700 కోట్ల గోల్‌మాల్‌ విషయంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల అరెస్ట్‌కు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.

➡️