- కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : త్వరలో అమరావతిలో ఏడు వందల పడకల ఇఎస్‌ఐ ఆస్పత్రి, మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తున్నానని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు కలెక్టరేట్‌లో రైల్వే, జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బి, కార్పొరేషన్ అధికారులతో ఆయన సమీక్ష చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చేపట్టిన రైల్వే, రహదారులకు సంబంధించిన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
గుంటూరులో శానిటేషన్ పరిస్థితిని మెరుగుపరచాలని, ఇపిఎఫ్‌లో పుట్టిన తేదీ మార్పు, రుణాల మంజూరు విషయంలో సమస్యలు రాకుండా, ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు మంత్రి సూచించారు. సమీక్షలో ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.