ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ప్రచారాన్నిఅడ్డుకున్న ఎన్నికల అధికారులు

  •  38వ వార్డు కౌన్సిలర్‌పై కేసు నమోదు

ప్రజాశక్తి-ప్రొద్దుటూరు : వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రచారాన్ని ఎన్నికల అధికారుల బృందం అడ్డుకుంది. మంగళవారం ఉదయం పట్టణంలోని 38వ వార్డులో వైసిపి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల అధికారులు అక్కడికి చేరుకుని ప్రచారం నిలిపివేయాలని చెప్పారు. సువిధ యాప్‌లో ముందుగా అనుమతి తీసుకోవాలని ఎమ్మెల్యేకు ఎన్నికల అధికారులు సూచించారు. దీంతో ఎమ్మెల్యే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారంటూ వైసిపి 38వ వార్డు కౌన్సిలర్‌ పల్లా రమాదేవి, ఆమె కుమారుడు పల్లా సురేష్‌పై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ సిఐ శ్రీకాంత్‌ తెలిపారు.

➡️