కొత్త యూనిట్లకు విద్యుత్‌ ధర

Oct 29,2024 00:20 #cost for new units, #Electricity
  • కొత్త యూనిట్లకు విద్యుత్‌ ధర
  •  నిర్ణయించిన ఎపిఇఆర్‌సి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎస్‌డిఎస్‌టిపిఎస్‌) స్టేజ్‌-1, స్టేజ్‌-2 యూనిట్లకు, డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (డా ఎన్‌టిపిపిఎస్‌) స్టేజ్‌-5 యూనిట్లకు విద్యుత్‌ ధర నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి) ఉత్తర్వులు విడుదల చేసింది. 2024-2029 కాలానికి సంబంధించిన టారీఫ్‌ను నిర్ణయించింది. ఎస్‌డిఎస్‌టిపిఎస్‌ స్టేజ్‌-1కు యూనిట్‌ ధర రూ.4.06లకు అనుమతి ఇవ్వాలని జెన్‌కో ప్రతిపాదించింది. దీంతో పాటు మరో 15 శాతం పెంచుకునే అవకాశం ఇవ్వాలని కోరింది. అయితే కమిషన్‌ రూ.3.80లకు అనుమతినిచ్చింది. స్టేజ్‌-5కు యూనిట్‌కు రూ.3.01లతో పాటు దీనికి అదనంగా 15 శాతం పెంచుకునే అవకాశం ఇవ్వాలని జెన్‌కో ప్రతిపాదించగా రూ.3.20లకు కమిషన్‌ అనుమతినిచ్చింది. ఎస్‌డిఎస్‌టిపిఎస్‌ స్టేజ్‌-5కు యూనిట్‌ ధర రూ.3.50లకు అనుమతినివ్వాలని జెన్‌కో కోరగా, కమిషన్‌ రూ.3.34లకు నిర్ణయించింది.

➡️