ఎసిబి వలలో విద్యుత్‌ శాఖ ఎఇ

Jun 25,2024 21:55 #acb, #Electricity Department AE

ప్రజాశక్తి-నెల్లూరు :వినియోగదారుడి నుంచి లంచం తీసుకుంటూ మంగళవారం విద్యుత్‌ శాఖ ఎఇ (అసిస్టెంట్‌ ఇంజనీర్‌) ఎసిబికి పట్టుబడ్డారు. ఎసిబి డిఎస్‌పి శిరీష తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరులోని అక్కచెరువుపాడు ప్రాంతానికి చెందిన హరిప్రసాద్‌ తన ఇంటికి విద్యుత్‌ మీటర్‌ కనెక్షన్‌ కోసం విద్యుత్‌ శాఖ ఎఇ శివశంకరయ్యను సంప్రదించారు. విద్యుత్‌ మీటర్‌కు అనుమతి ఇచ్చేందుకు ఎఇ రూ.80 వేలు డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించారు. ఎసిబి అధికారుల సూచన మేరకు హరిప్రసాద్‌ రూ.50 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ డబ్బును హరిప్రసాద్‌.. ఎఇ శివశంకరయ్యకు అందజేస్తుండగా ఎసిబి డిఎస్‌పి శిరీష ఆధ్వర్యంలో సిఐలు శ్రీనివాస్‌, కిరణ్‌, ఆంజనేయరెడ్డి, విజరుకుమార్‌రెడ్డి దాడి చేసి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎఇని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

➡️