పంట పొలాలపై ఏనుగుల దాడి

May 18,2024 20:53 #chitoor, #Crop Damage, #elephant attack

ప్రజాశక్తి- సదుం (చిత్తూరు జిల్లా) : పంట పొలాలపై ఏనుగులు దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా సదుం మండలం జోగివారిపాల్లి పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. ఐరాల మండలం నుంచి శుక్రవారం అర్థ రాత్రి ఏనుగుల గుంపు వచ్చి జోగివారిపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న వరి, మామిడి, టమాట పంటలను ధ్వంసం చేశాయి. పంట పొలాల చుట్టూ రక్షణ కోసం ఏర్పాటు చేసిన కంచెలను సైతం ధ్వంసం చేసి పంటలను తిని, తొక్కి, డ్రిప్‌ పైపులనూ తొక్కి నాశనం చేశాయి. ఈ ఘటనలో రూ. లక్షల్లో పంటలు నష్టపోయామని రైతులు నరసింహారెడ్డి, రెడ్డప్పరెడ్డి, సురేష్‌ రెడ్డి, రఘులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి నుంచి బత్తలవారిపల్లి, జోగివారిపల్లి ప్రాంతాల్లో ఏనుగులు గుంపు సంచరిస్తూ పంటలను తొక్కి నాశనం చేశాయని రైతులు తెలిపారు. ఇకనైనా తగిన చర్యలు తీసుకోవాలని, తమ తమ పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

➡️