ఏనుగుల గుంపు హల్‌చల్‌.. పంటపొలాలు ధ్వంసం

Feb 13,2024 11:50 #destruction, #elephant, #lost crops

ప్రజాశక్తి – సదుం (చిత్తూరు) : సదుం మండల పరిధిలోని జోగివారిపల్లి గ్రామపంచాయితీ పరిధిలో ఏనుగుల గుంపు హల్‌చల్‌ చేస్తోంది. ఏనుగుల భయంతో స్థానిక, చుట్టుపక్కల రైతులంతా భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం అక్కడి రైతులు మాట్లాడుతూ … మార్తువారిపల్లి కి చెందిన రైతు లోకనాధ కు చెందిన చెరుకు పంట పొలాల్లో ఏర్పాటు చేసుకున్న చెరుకు గానుగ ఆడే క్రషర్‌ ను ఏనుగుల గుంపు ధ్వంసం చేసిందని తెలిపారు. రైతు కు సుమారుగా రూ.50వేల నష్టం వాటిల్లినట్లు చెప్పారు. ఏనుగుల గుంపు చుట్టు పక్కల వున్న పంట పొలాలపై పడి అరటి, మామిడి పంటలను ధ్వంసం చేసినట్లు స్థానిక రైతుల నుండి సమాచారం. అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టి తమను ఆదుకోవాలని స్థానిక రైతులంతా వేడుకుంటున్నారు.

➡️