- బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులు 65,783 ఎకరాలకు, 31,590 ఎకరాలు ఆక్రమణల్లో ఉన్నట్లు వక్ఫ్ బోర్డు ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. విజయవాడ వక్ఫ్ బోర్డు రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… వక్ఫ్ బోర్డు ఆస్తులను దాతలు దానంగా ఇచ్చారని, వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని ముస్లిం మతానికి చెందిన పేదలకు, వితంతువులకు, అనాధలకు ఖర్చు చేస్తాం తప్ప ఇతరులు ఆక్రమించుకోవడానికి అవకాశం ఇవ్వకూడదని అన్నారు. ఇప్పటి వరకూ జిల్లాల్లో 651 ఎకరాల భూమికి సంబంధించి 40 ఫిర్యాదులు వచ్చాయని, ఆయా జిల్లాల కలెక్టర్, ఎస్‌పిలు ఈ ఫిర్యాదులపై దర్యాప్తు చేయాలని కోరారు. జిల్లా వక్ఫ్ ఇన్‌స్పెక్టర్లు చేయాల్సిన పనులను ఆక్రమణదారులు అడ్డుకుంటున్నట్లు చెప్పారు.