ప్రజాశక్తి- మార్కాపురం, ఒంగోలు బ్యూరో : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల రక్షణ కోసం ‘శక్తి’ పేరుతో రూపొందించిన యాప్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. యాప్‌ను మహిళలు తమ సెల్‌ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. ఎక్కడైనా అకతాయిలతో ప్రమాదం పొంచి ఉంటే ఐదు లేదా ఆరుసార్లు సెల్‌ఫోన్‌ను ఊపితే 7-8 నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడకు చేరుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, గుమ్మడి సంధ్యారాణి, డిజిపి హరీష్‌కుమార్ గుప్తా, ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, దామచర్ల జనార్థన్, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, బిఎన్ విజయకుమార్, మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, పర్యాటక సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్, దర్శి ఇన్‌ఛార్జి గొట్టిపాటి లక్ష్మి, కలెక్టర్ తమీన్ అన్సారియా, ఎస్‌పి దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
