ప్రజాశక్తి -సీతారాం ఏచూరి నగర్ (నెల్లూరు) : నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించాలనే తీర్మానాన్ని పూర్ణ (పశ్చిమగోదావరి) ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని వి.ఇందిర (పార్వతీపురం మన్యం) బలపరిచారు. రాష్ట్రంలో రేషన్ డిపోల్లో ఇచ్చే సరుకుల్లో ప్రభుత్వాలు క్రమంగా కోతపెట్టారని, నగదు బదిలీకి రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, కందిపప్పు, పంచదార సరఫరా అరకొరగానే ఉంది.
పామాయిల్ సరఫరా నిలిపివేశారని తీర్మానంలో వివరించారు. కోవిడ్ సమయంలో ప్రతి మనిషికీ అదనంగా ఇచ్చిన ఐదు కిలోల బియ్యం సరఫరా ఇప్పుడు నిలిపివేశారని సన్న బియ్యం ఇస్తామని వైసిపి ఊరించి మోసగించిందని, రేషన్ బియ్యం అక్రమ రవాణాతో నాడు, నేడు వేల కోట్ల రూపాయలు పాలక పార్టీల నేతలు, అధికారులు దోచుకుంటున్నారని పేర్కొంది. అధిక ధరలు తగ్గించాలని, ప్రజా పంపిణీతో నిత్యావసర సరుకులు అందించాలని రాష్ట్ర మహాసభ డిమాండ్ చేసింది.
