17 మంది సభ్యులతో ఆర్‌టిసి బోర్డు ఏర్పాటు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎపిఎస్‌ఆర్‌టిసి బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి బుధవారం జిఓ ఎంఎస్‌ నెంబరు 6ను విడుదల చేసింది. ఎపిఎస్‌ఆర్‌టిసి ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణ, వైస్‌ ఛైర్మన్‌గా పిఎస్‌ మునిరత్నంతోపాటు డైరెక్టర్లు దొన్నుదొర, రెడ్డి అప్పలనాయుడు, సురేష్‌రెడ్డి, పూల నాగరాజులు నామినేటెడ్‌ సభ్యులు కాగా, అఫీషియల్స్‌లో రవాణా, ఆర్థిక, జిఎడి ప్రిన్సిపల్‌ సెక్రటరీలు, ఆర్‌టిసి ఎమ్‌డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, ఫైనాన్సియల్‌ అడ్వైజర్‌లను నియమించింది. వీరితోపాటు బోర్డులో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా మరో 5 విభాగాలకు చెందిన అధికారులను నియమించారు. కేంద్ర ప్రభుత్వ రోడ్‌ సేఫ్టీ డైరెక్టర్‌, ట్రాన్స్‌పోర్ట్‌ డైరెక్టర్‌తోపాటు కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్లను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.

➡️