మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత

హైదరాబాద్‌: గులాబీ పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డి భార్య డాక్టర్‌ శ్వేత తీవ్ర అనారోగ్యంతో మఅతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు దృవీకరించారు. గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి భార్య తీవ్ర అనారోగ్యంతో పోరాటం చేస్తున్నారు. అయితే ఆమె ఆరోగ్యం విషమించడంతో సోమవారం రాత్రి ఆస్పత్రిలోనే మరణించినట్లు సమాచారం. హోమియోపతి వైద్యుడైన లక్ష్మారెడ్డి.. జడ్చర్ల ఎమ్మెల్యేగా పలుసార్లు విజయం సాధించారు. కెసిఆర్‌ ప్రభుత్వంలో ఇంధన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా లక్ష్మారెడ్డి పనిచేశారు. లక్ష్మారెడ్డి భార్య మృతి చెందిన నేపథ్యంలో గులాబీ నేతలు సంతాపం తెలుపుతున్నారు.

➡️