ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాఠశాల పండగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి పీతల సుజాత పిలుపునిచ్చారు. ఈ నెల 7న పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యాన ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వీకారం చుట్టనున్నారని తెలిపారు. టిడిపి కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఆమె విలేకరులతో మాట్లాడారు. విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సత్సంబంధాలు ఏర్పడటమే కాకుండా విద్యార్థుల్లో నెలకొన్న భయాలు తొలగిపోతాయని అన్నారు. ప్రభుత్వం త్వరలో మెగా డిఎస్‌సి నిర్వహించబోతుందని తెలిపారు.
గ్రీవెన్స్ నిర్వహించిన మంత్రి ఆనం
దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ సుజరు కృష్ణ రంగారావు టిడిపి కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. రాష్ట్ర నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.