అదాని కృష్ణపట్నం పోర్టుకు ఎక్సలెన్స్‌ అవార్డు

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : అదాని కృష్ణపట్నం పోర్టుకు ఎన్విరాన్‌మెంట్‌ ఎక్సలెన్స్‌ అవార్డు దక్కింది. అదాని కృష్ణపట్నం పోర్ట్‌ లిమిటెడ్‌కు ప్లాటినం కేటగిరీ కింద సేవా రంగంలో జాతీయ స్థాయి 18వ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఐసిసి) ఎన్విరాన్‌మెంట్‌ ఎక్సలెన్స్‌ అవార్డు-2024ను అందుకుంది. కోల్‌కతాలోని తాజ్‌ బెంగాల్‌ హోటల్‌లో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ శశి పంజా నుంచి పర్యావరణ శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రోష్నిసేన్‌ అవార్డు అందుకున్నారు. సుస్థిరత, పర్యావరణ ఆవిష్కరణ, బాధ్యతాయుతమైన వ్యాపార విధానాల పట్ల నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనమని ఆదాని కృష్ణపట్నం పోర్టు సిఇఒ జగదీష్‌ పటేల్‌, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

➡️