ల్యాబ్‌లో పేలిన రియాక్టర్‌ .. ఆందోళనలో సిబ్బంది

Aug 30,2024 11:05 #Exploded, #lab, #reactor

నల్గొండ : నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలోని జాతీయ రహదారి 65 పై ఉన్న శ్రీపతి ల్యాబ్‌ లో అకస్మాత్తుగా రియాక్టర్‌ పేలి మంటలు వస్తున్నాయి. రసాయన పూరితమైన పొగ దట్టంగా వస్తుండడంతో జాతీయ రహదారిపై వెళ్లే ప్రయాణికులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. రియాక్టర్‌ పేలిన సమయంలో కంపెనీలో ఎంతమంది లేబర్‌ పనిచేస్తున్నారో.. సిబ్బంది ఎంతమంది ఉన్నారో? వివరాలు తెలియ రాలేదు.. సమాచారం అందుకున్న స్పందించిన పోలీస్‌ సిబ్బంది నార్కెట్‌పల్లి సీఐ ఆధ్వర్యంలో ఫైర్‌ ఇంజన్‌ పిలిపించి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కంపెనీలో సుమారుగా 30 నుంచి 40 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. మంటలు పూర్తి అదుపులోకి వచ్చినట్లు ఫైర్‌ సిబ్బంది చెబుతున్నారు. పూర్తి వివరాలు కాసేపట్లో తెలియనున్నాయి.

➡️