ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫీజు గడువును ఇంటర్మీడియట్‌ బోర్డు పొడిగించింది. ఈ నెల 21వ తేదీతో ముగిసిన గడువును డిసెంబరు 5 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో పరీక్ష గడువు ముగిసిన తరువాత అపరాధం రుసుం గ్రాడ్యువల్‌గా బోర్డు పెంచుతోంది. రూ.120లతో మొదలయ్యే రుసుం ఒకేసారి రూ.1000లకు పెంచింది. ఈ ఫీజు చెల్లింపు సరికాదని బోర్డు కార్యదర్శికి ఎస్‌ఎఫ్‌ఐ వినతిపత్రం అందజేసింది. అదేవిధంగా గడువు కూడా పెంచాలని కోరింది. ఇప్పుడు మరలా ఎలాంటి అపరాధ రుసుం లేకుండా డిసెంబరు 5 వరకు చెల్లించేలా ఉత్తర్వులిచ్చింది.

➡️