తెలంగాణ భవన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత..

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో వెంటనే మెడికల్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ మినిస్టర్‌ క్వార్టర్స్‌ ముట్టడికి బయలుదేరిన బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం నాయకులను తెలంగాణ భవన్‌ ముందు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థి విభాగం నేతలకు తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్వీ లీడర్స్‌ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ భవన్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బీఆర్‌ఎస్వీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

➡️