ప్రజాశక్తి-అమరావతి : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌పై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. దళితుడిని కిడ్నాప్ చేసినందుకు వల్లభనేని వంశీ జైలుకెళ్లారని స్పష్టం చేశారు. వంశీపై చట్టపరమైన చర్యలు ఉంటాయని.. తప్పు చేసిన వైసీపీ నేతలు శిక్షలు తప్పించుకోలేరని లోకేశ్ హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ అరాచక పాలనను అందరూ చూశారని, ప్రజా సమస్యలపై పోరాడిన తమపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు.
