ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలు

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ : రేణిగుంట విమానాశ్రయం నుండి శుక్రవారం తిరుగు ప్రయాణమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సాదర వీడ్కోలు లభించింది. తిరుపతి జిల్లా నారావారిపల్లెలో సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియల ప్రక్రియలు పూర్తిచేసుకుని శుక్రవారం ఉదయం 11.05 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రికి డిఐజి షిమోషి బాజ్‌ పేరు, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర్‌, ఎస్‌పి సుబ్బరాయుడు, తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ నారపు రెడ్డి మౌర్య, జెసి శుభం బన్సల్‌, ఎమ్మెల్యేలు చంద్రగిరి పులివర్తి నాని, శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్‌ రెడ్డి, సత్యవేడు కోనేటి ఆది మూలం, నగరి భాను ప్రకాష్‌, సూళ్లూరుపేట నెలవల విజయశ్రీ, పూతలపట్టు మురళి, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ చక్రవర్తి, యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ నరసింహ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, శ్రీధర వర్మ, అధికారులు సాదర వీడ్కోలు పలికారు.

➡️