అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Jun 9,2024 22:57 #rythu, #suside

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : అప్పుల బాధతో పురుగులమందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలోని పూల్‌సింగ్‌ నాయక్‌ తండాలో ఆదివారం జరిగింది. కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాథోడ్‌ సుభాష్‌ (45) తనకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో గతేడాది పత్తి సాగు చేశారు. అతివృష్టి, అనావృష్టితో పంట దిగుబడి రాకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక కలత చెంది ఆదివారం తన ఇంటి సమీపంలో పురుగులమందు తాగి పడిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను బోథ్‌ ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. రైతుకు బ్యాంకులో రూ.1.5 లక్షలు, ప్రయివేటుగా రూ.1.5 లక్షలు మొత్తం రూ.3 లక్షలు అప్పు ఉన్నట్టు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రాము తెలిపారు.

➡️