విద్యుద్ఘాతంతో రైతు మృతి 

Jul 22,2024 18:49 #Current shock, #Farmer, #Visakha

ప్రజాశక్తి-పద్మనాభం: విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందారు. విశాఖ జిల్లాలోని పద్మనాభం మండలంలోని అనంతవరం గ్రామానికి చెందిన కసిరెడ్డి అప్పారావు (29)  సోమవారం ఉదయం 9 గంటలకు తన పొలంలో ఉన్న వ్యవసాయ వ్యవసాయ మోటార్ ను ఆన్ చేశాడు. విద్యుత్ షాక్ కొట్టి అక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు. ఏ ఎస్ ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️