ప్రజాశక్తి- రామచంద్రాపురం (తిరుపతి జిల్లా) : తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం గంగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు వడదెబ్బతో మృతి చెందారు. ఆయన కుటుంబసభ్యుల కథనం ప్రకారం… రైతు ఎం.చంగల్రాయ యాదవ్ (65) మంగళవారం ఉదయం తన పొలానికి వెళ్లారు. పొలం పనులను 11 గంటలకు ముగించుకొని ఎండలో ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే కళ్లు తిరుగుతున్నాయంటూ కుటుంబ సభ్యులకు తెలిపి కింద పడిపోయారు. 108 వాహనంలో తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
