విమానాశ్రయం వద్దని రైతుల నిరసన

Nov 2,2024 22:33 #airport, #farmers, #Protest

ప్రజాశక్తి-తొండంగి : కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి, చిన్నయ్యపాలెం పరిధిలో విమానాశ్రయం నిర్మించాలనే యోచనను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ నాలుగు రోజులుగా బాధిత రైతులు నిరసన కొనసాగిస్తున్నారు. విమానాశ్రయం వద్దని, ఆహార భద్రత ముద్దని, రెండు పంటలు పండే పచ్చని పొలాలు కాపాడాలని తమ పొలాల గట్ల వద్ద శనివారం రైతులు నినాదాలు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం పోలవరం పుష్కర జాతీయ రహదారుల అభివృద్ధి నిర్మాణాలకంటూ తమ నుంచి వేల ఎకరాల భూములు తీసుకుందని వాపోయారు. ఉన్న అరకొర భూమిని కోల్పోతే వీటిపైనే ఆధార పడ్డ తమ కుటుంబాలు జీవనాధారం కోల్పోతాయని, కౌలు రైతుల ఉపాధి ప్రశ్నార్థకమవుతుందని అన్నారు. నిస్సారవంతమైన భూములను లేదా ప్రభుత్వ భూమి ఉన్నచోట విమానాశ్రయం కోసం భూసేకరణ చేపట్టాలని రైతులు కోరారు.

➡️