తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం

May 16,2024 10:03 #road accident, #Tirupati district

ఇరువురు మృతి, 5 మంది గాయాలు

ప్రజాశక్తి-తిరుపతి సిటీ : చిత్తూరు – బెంగళూరు జాతీయ రహదారిలోని మొగిలి ఘాట్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీలు ఒకటి వెనుక ఒకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. మృతి చెందిన వారు బంగారుపాలెం మండలం కీరమంద గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న బంగారుపాలెం సిఐ లక్ష్మయ్య ఘటనపై విచారిస్తున్నారు.

➡️