రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు మృతి

Nov 29,2023 12:20 #daughter, #died, #Father, #road accident

ప్రజాశక్తి-రొద్దం (అనంతపురం) : రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి చెందిన ఘటన బుధవారం రొద్దంలో జరిగింది. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఫణిందర్‌ రెడ్డి (33) ఆయన కుమార్తె గౌతమి (4)తో కలిసి పని నిమిత్తం స్వగ్రామం నుంచి సమీపంలో ఉన్న కర్నాటక రాష్ట్రం వెంకటాపురం గ్రామానికి స్కూటీపై బయలుదేరాడు. హిందూపురం వైపు నుంచి రొద్దం మండలంలోని రెడ్డిపల్లి చెరువు కట్టపైకి ఎదురుగా ఆర్‌టిసి బస్సు వచ్చింది. మరోవైపు చెట్లు గుబురుగా ఉన్నాయి. దీంతో స్కూటీ, ఆర్‌టిసి బస్సుకు తగిలింది. ఈ ప్రమాదంలో తండ్రీకూతురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. భర్త, కుమార్తె విగతజీవులుగా పడి ఉండటంతో ఫణిందర్‌ రెడ్డి భార్య, బంధువుల రోదన మిన్నంటింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️