ప్రజాశక్తి-పెద్దముడియం (కడప జిల్లా) : కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కసాయివాడిలా లైంగిక దాడికి పాల్పడ్డాడు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండల పరిధిలోని నెమళ్లదిన్నె గ్రామంలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..మతిస్థిమితం లేని 17 సంవత్సరాల వయసు గల కన్న కూతురిపై మద్యం మత్తులో తండ్రి లైంగిక దాడికి ఒడిగట్టాడు. తండ్రి అసభ్య ప్రవర్తనతో కూతురు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుబ్బారావు తెలిపారు.