రైతులను ముంచిన ‘ఫెంగల్‌’

Dec 5,2024 01:55 #drowned, #farmers, #Fengal, #havy rains

ప్రజాశక్తి, యంత్రాంగం : ఆరుగాలం కష్టించి పండించిన పంటలపై ఫెంగల్‌ తుపాను తీవ్ర ప్రభావం చూపింది. రైతులను నిండా ముంచింది. వర్షాలకు వరి చేలు ఒరిగిపోయాయి. కోసి ఆరబెట్టిన వరి పనలు తడిచిపోయాయి. కళ్లాల్లోనూ, రోడ్లపైనా ఆరబెట్టిన ధాన్యం రాశులు తడిచి ముద్దయ్యాయి. దీంతో, ధాన్యం రంగు మారే, మొలకలు వచ్చే ప్రమాదం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. పలు జిల్లాల్లో వరి పొలాలు ఇంకా వరద నీటి ముంపులోనే ఉన్నాయి.

➡️