తెలంగాణ : తెలంగాణలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఫిబ్రవరిలోనే వేసవిని తలపించేలా ఎండలు మండుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో తేమ శాతం తగ్గడంతో ఎండలు పెరిగాయని, 32 నుంచి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పింది. హైదరాబాద్, నిజామాబాద్, హనుమకొండ, మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయని వెల్లడించింది. మరో వారం రోజులపాటు ఈ ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగుతాయని, ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
