లైంగిక వేధింపుల కేసు కొట్టేయండి

  • హైకోర్టులో టిడిపి ఎమ్మెల్యే ఆదిమూలం పిటిషన్‌

ప్రజాశక్తి-అమరావతి : తనపై నమోదైన అత్యాచారం ఆరోపణల కేసును కొట్టేయాలంటూ సత్యవేడు టిడిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. ఏవిధమైన ప్రాథమిక విచారణ చేయకుండానే కేసు నమోదు చేశారని, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్‌)లోని సెక్షన్‌ 173(1)కి వ్యతిరేకంగా కేసు నమోదు చేశారన్నారు. ఎమ్మెల్యే తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు, అత్యాచారానికి పాల్పడ్డారంటూ టిడిపి నాయకురాలు ఈ నెల 5న తిరుపతి తూర్పు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు 72 ఏళ్లని, కావాలని కేసులో ఇరికించారని, ఇది హనీ ట్రాప్‌ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. వీడియోలన్నీ మార్ఫింగ్‌వేనని తెలిపారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణ చేయనుంది.

➡️