బిబిఎ, బిసిఎ కోర్సులకు ఫీజుల ఖరారు

Aug 2,2024 00:25 #engineering colleges., #fee

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశపెట్టిన బిబిఎ, బిసిఎ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజులను నిర్ధారించింది. ఈ మేరకు జిఓ 45ను ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ గురువారం విడుదల చేశారు. రాష్ట్రంలో మూడు కళాశాలల్లో ఈ కోర్సులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. గుంటూరులోని ఆర్‌విఆర్‌ జెసి, నెల్లూరులోని జెనెక్స్‌ విజన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలల్లో ప్రవేశపెట్టిన బిబిఎ కోర్సులకు రూ.18 వేలు, అనకాపల్లిలోని దాడి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలోని బిసిఎ కోర్సుకు రూ.18 వేల చొప్పున నిర్ధారించారు.

➡️