కియా అనుబంధ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

May 15,2024 22:56 #Fatal fire accident, #Kia

ప్రజాశక్తి-సోమందేపల్లి : శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల పరిధిలోని గుడిపల్లి ఇండిస్టియల్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన కియా అనుబంధ ఎస్‌ఎల్‌ఎపి పరిశ్రమలో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు… ఎస్‌ఎల్‌ఎపి కంపెనీలో వెల్డింగ్‌ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు ఎగిసి పడి మంటలు వ్యాపించాయి. దీంతో కార్మికులు పరుగులు తీస్తూ బయటకు వచ్చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. కాగా ఈ ప్రమాదంలో పరిశ్రమకు సంబంధించి పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లు తెలుస్తోంది. నష్టం అంచనా వేయాల్సి ఉందని పరిశ్రమ ముఖ్య ఉద్యోగులు తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో వారు మంటలను అదుపుచేశారు. ప్రమాద విషయం తెలుసుకున్న సోమందేపల్లి ఎస్‌ఐ విజరు కుమార్‌ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలన చేపట్టారు.

➡️