కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం

Mar 23,2025 13:16 #Fire Accident, #in Kukatpally

తెలంగాణ : హైదరాబాద్‌ కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఐడీఎల్‌ చెరువు సమీపంలో పెను ప్రమాదం తప్పింది. డీజిల్‌ ట్యాంకర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న కారు కూడా దగ్ధమైంది. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు.

➡️