- మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : చేపల వేట నిషేధం గడువు ముగిసి 8 నెలలు దాటుతున్నా.. నేటికీ చేపల వేట నిషేధ భృతి ఇంతవరకు లబ్ధిదారుల ఖాతాల్లో జమకాలేదని ఎపి మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం పేర్కొంది. ఈ మేరకు శనివారం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లాటి శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. సముద్రంలో ప్రమాదాలు జరగకుండా లైఫ్ జాకెట్లు, ఫైబర్ రింగులు, జిపిఎస్, ఎక్కో, అగ్ని ప్రమాదాలు జరగకుండా నత్రజని సిలిండర్లతోపాటు పరికరాలు ఇవ్వాలని, లబ్ధిదారుల ఖాతాల్లో నగదును తక్షణమే జమ చేయాలని డిమాండ్ చేశారు.