జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో ‘ఫిట్జీ’ విద్యార్థి తేజేశ్వర్‌కు స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌

ప్రజాశక్తి- ఎడ్యుకేషన్‌ (విజయవాడ) : ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో జెఇఇ అడ్వాన్స్‌డ్‌ 2024 ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థి కోడూరు తేజేశ్వర్‌కు ఆలిండియా 8వ ర్యాంక్‌, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి మొదటి ర్యాంక్‌ సాధించినట్లు పిట్జీ డైరెక్టర్‌ పిన్నెపు రమేష్‌బాబు తెలిపారు. విజయవాడలోని పిట్జీ క్యాంపస్‌లో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ సంస్థకు, రాష్ట్రానికి పేరు తెచ్చిన తేజేశ్వర్‌ను అభినందించారు. తమ సంస్థకు సంబంధించి దాదాపు 300 మందికిపైగా విద్యార్థులు ఈ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించి ఐఐటిలో ప్రవేశం పొందారని తెలిపారు. ఇటీవల జరిగిన జెఇఇ మెయిన్స్‌ ఫలితాల్లో కూడా తమ విద్యార్థులు వంద శాతం విజయం సాధించారని రమేష్‌బాబు చెప్పారు.

➡️