కారు చెరువులోకి దూసుకెళ్లి ఐదుగురు మృతి

Dec 7,2024 08:49 #road accident, #Telangana

యాదాద్రి: తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఘటనలో ఐదుగురు మృతి చెందారు. కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్ళడంతో ప్రమాదం సంభందించింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అధిక వేగంలో ఉన్న కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమం ఉన్నట్టు తెలుస్తోంది. కారు ప్రమాదానికి గురైన సమయంలో ఆరుగురు ఉన్నట్టు సమాచారం. మృతులను హైదరాబాద్‌కు చెందిన వంశీగౌడ్‌, దినేష్‌, బాలు, హర్షబాబు, వినయ్‌గా గుర్తించారు. ప్రమాదం నుంచి మణికంఠ ఒక్కడే బయట పడ్డారు.

➡️