ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఐదుగురికి తీవ్ర గాయాలు

May 21,2024 16:46 #5 injured, #road acident

ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్య) : రైల్వేకోడూరు మండలం రాఘవరాజుపురం పంచాయతీలో మంగళవారం ఉదయం హెచ్‌పి పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం తిరుమల యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న స్థానికులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అమర హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రమాదం లేదని అమర హాస్పిటల్‌ వైద్యుల బృందం తెలియజేశారు.

➡️