ఎపిఎస్ ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌ఇ జెఎసి డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ కోరింది. తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ కార్యాలయంలో, కమిషనర్ విఆర్ కృష్ణతేజను జెఎసి ఛైర్మన్ ఎం రామచంద్రయ్య, ప్రధాన కార్యదర్శి డి శేషు తదితర నాయకులు శుక్రవారం కలిసి సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. ముఖ్యంగా 2016 సర్క్యులర్ ప్రకారం జెఇ, టిఎ, ఇతర కేడర్‌ల సిబ్బందికి గ్రేడ్స్ ఫిక్సేషన్ జరగలేదన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల దృష్ట్యా ఆరేళ్ల నుంచి సిబ్బందికి జీతాలు పెంచనందున పిఆర్‌సి 23 శాతం అమలు చేయాలని కోరారు. సిబ్బందికి గ్రాట్యూటీ అమలు చేయాలని, సీనియారిటీ ప్రకారం విద్యార్హతల ఆధారంగా ఖాళీగా ఉన్న పోస్టులకు పదోన్నతులు కల్పించాలన్నారు. అవుట్‌సోర్సింగ్‌లో పని చేస్తున్న ఉద్యోగులను ఎఫ్‌టిఇలుగా కన్వర్ట్ చేయాలని, 2018లో ఒఎస్ నుంచి ఎఫ్‌టిఇలుగా కన్వర్ట్ అయిన సిబ్బంది సర్వీసుకు అనుగుణంగా ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. ఇతర సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న ఇంక్రిమెంట్లు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు
