ప్రజాశక్తి-విఆర్‌పురం : గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో సోమవారం ఉదయం నుంచి విఆర్‌పురం మండలంలోని మొద్దులాగూడెం, అన్నవరం, వడ్డిగూడెం, సీతంపేట, పలు గ్రామాలు మండలానికి రాకపోకలు నిలచిపోయాయి. దీంతో అధికారులు మర పడవలు ఏర్పాటు చేసి విఆర్‌పురం మండలంలోని గ్రామల ప్రజలను రేకపల్లికి పునర్వాస కేంద్రాలకు తరలిస్తున్నారు.