రేపు ఎర్త్‌ అవర్‌ పాటించండి : గవర్నర్‌ పిలుపు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ ఎర్త్‌ అవర్‌ గ్లోబల్‌ ఉద్యమంలో భాగంగా మార్చి 22న రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఒక గంట పాటు అన్ని అవసరమైన లైట్లను స్వచ్చందంగా ఆపి వేసి ఎర్త్‌ అవర్‌ పాటించాలని గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌ అబ్ధుల్‌ నజీర్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. వాతావరణ పరిరక్షణ ఉద్యమంలో ప్రజలందరినీ ఏకం చేస్తూ భవిష్యత్తు తరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించడంలో ఈ కార్యక్రమం సహాయపడుతుందని గవర్నర్‌ పేర్కొన్నారు.

➡️