ప్రజాశక్తి-అమరావతి : ఎస్సీ కార్పోరేషన్ ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారుల నుండి బలవంతపు రుణ రికవరీలు నిలుపుదల చేయాలని కెవిపిఎస్ రాష్ట్ర అద్యక్ష ప్రధాన కార్యదర్శులు ఓ నల్లప్ప, అండ్ర మాల్యాద్రి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రుణాల వసూళ్ల పేరుతో దళితులను ఇబ్బంద్ది పెట్టడం తగదన్నారు. బలవంతంగా వసూళ్లు చేస్తున్న ఎండి ఇతర అధికారులపై సమగ్ర విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళిత, గిరిజనులకు ఇచ్చిన రుణాలను మాఫీ చెయ్యాలని కోరారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం తీసుకుని అధికారులకు ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. అప్పటివరకు అధికారులకు సమగ్రమైన ఆదేశాలు ఇవ్వలన్నారు. లేకపోతే లబ్ధిదారులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
